Vasavisatram Vemulawada

Email Address

vasaviannapurnasatram@gmail.com

Phone Number

+91-9246935053

Our Location

1St bypass road, opposite maharaja functional, near Temple Parking, Vemulawada, Telangana 505302

మా గురించి:

శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యన్నదాన సత్రం ట్రస్ట్

ఇది ఆర్యవైశ్య స్వాభిమానుల సమూహం. సానుకూల దృక్పథం గల వ్యక్తుల బృందం. వేములవాడలో పుట్టి పెరిగినవారు, వేర్వేరు ప్రాంతాల నుంచి వేములవాడకు వచ్చి జీవనం సాగిస్తున్న వారు కలిసి అరమరికలు లేకుండా ఏర్పాటు చేసిన సేవాసంస్థ. ఈ ప్రాంత మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, గురువులతో చిన్ననాటి సంగతులపై, సంభాషించుకోవడంతో అంకురార్పణకు నోచుకున్న ట్రస్టు ఇది.

 

కరోనా విజృంభించిన సమయాన.. కుటుంబసభ్యులే పట్టించుకోలేని విపత్కర సమయాన.. బతికుంటామో లేదోననే భయంతో మనిషితో మనిషి మాట్లాడడమే గగనమైన సమయాన.. మేము మా సేవలు మొదలు పెట్టాం. తొలుత ఏ దిక్కూలేని కరోనా పేషంట్లకు భోజనంతో పాటు తొందరగా కోలుకోవడానికి అవసరమైన ఆహారాన్ని సమకూర్చాము. ఐసోలేషన్‌ సెంటర్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు, వైద్య సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనం అందజేశాం. ఆదిభిక్షువు నెలవైన వేములవాడలో ఎన్నెన్నో అన్నసత్రాలున్నాయి. వాటి మీద, వచ్చే యాత్రికుల మీద ఆధారపడి పొట్టపోసుకునే అభాగ్యులు వందల్లో ఉన్నారు. వారికి కరోనా సమయంలో తిండి దొరకడమే గగనమైంది. ఆకలితో ఎవరూ అలమటించకూడదనే ఉద్దేశ్యంతో మేం వారికి అన్నప్రసాద వితరణ చేశాం. అలా మొదలైన మా సేవలు ఇంతింతై.. అన్నట్టు నిరంతరాయంగా 800 రోజులుగా సాగుతున్నాయి. మా సేవల్లో నిస్వార్ధతను గమనించిన పురప్రజలు, బయటి ప్రాంతాల వారూ.. తమవంతు సాయంగా విరాళం అందజేస్తున్నారు. బారసాలలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులకే కాకుండా గతించిన పెద్దల కర్మ రోజున, సంవత్సరీకం సందర్భంగానూ వారి పేరిట భోజనం పెట్టిస్తున్నారు. ఇలా రోజుకు 50 భోజనాలతో మొదలై ఒక్కోసారి 500 భోజనాలు పెట్టే దశకు ట్రస్టు చేరుకున్నది. ఇది అందరి సహానుభూతి వల్ల, సాయం చేయాలన్న దృక్పథం వల్ల సాధ్యమైంది. ఇలా రాత్రిపూట భోజనాలందించేందుకు అవకాశం దొరకడమే కాకుండా అటు భోజనం ఏర్పాటు చేసినవారికి, ఇటు భోజనం తిన్నవారికి సంతృప్తి కలిగించే తృప్తి మాకు దక్కింది.

కొవిడ్‌ ఉధృత సమయంలో..

కొవిడ్‌ ఉధృతి సమయాన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ మావంతు ప్రచారం నిర్వహించాము. నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి రూ.1500 విలువైన నిత్యావసర సరుకులు అందించాం. పోలీసులు, వైద్య సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లు, ఎనర్జీడ్రింక్స్‌ సరఫరా చేశాం. మాస్కు ఆవశ్యకతను వివరిస్తూ వేములవాడ పట్టణంలో ఐదువేలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం. అవసరమైన వారికి మందులను, విటమిన్‌ సప్లిమెంట్లను అందజేశాం.

నీళ్లబాటిళ్లు, అరటిపండ్లు..

వేములవాడ క్షేత్రం.. శ్రీరాజరాజేశ్వరస్వామి నెలవైన ప్రాంతం. ఇక్కడికి వచ్చీపోయే యాత్రికుల సంఖ్య వేలల్లో ఉంటుంది. మహాశివరాత్రి, శ్రీరామనవమి వంటి పండుగల సందర్భంలో లక్షల్లో వస్తారు. హనుమాన్‌ జయంతికి మాల వేసుకుని వేములవాడకు దర్శనానికి వచ్చేవారూ వేలల్లో ఉంటారు. అయితే.. జనం ఎక్కువైనపుడు సదుపాయాలు మృగ్యమవుతాయి. కష్టాలు తప్పవు. అందుకని ఇలాంటి సందర్భాల్లో మేము నీటిబాటిళ్లను అందజేశాము, క్షుద్భాద తీర్చుకునేందుకు అరటిపండ్లు, పులిహోర అందుబాటులో ఉంచాము. ఒక్క మహాశివరాత్రి సందర్భాన 20వేల చొప్పున వాటర్‌బాటిళ్లను ఇవ్వగలిగాము. శ్రీరామనవమికి 10వేల బాటిళ్లు, హనుమాన్‌ జయంతికి మరో 10వేల బాటిళ్ల చొప్పున దాతల సహాయంతో సమకూర్చగలిగాము. మూడేళ్లుగా మా సేవలకు దాతలు తమకు తోచినంత సాయం అందించారు, అందిస్తున్నారు.

కార్తీకమాసం.. దీపోత్సవం

శివుడికి ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. ఈ నెలలో వేలాది సంఖ్యలో దీపాలు వెలిగించడం వల్ల అందరి జీవితాల్లో చీకట్లు తొలిగి వెలుగులు నిండుతాయన్నది నమ్మకం. ఈ క్షేత్రంలో పుట్టిన మేమూ ఇదే విశ్వాసంతో ఉన్నాం. కార్తీకమాసంలో వేములవాడ పట్టణంలోని భీమేశ్వర, నగరేశ్వర, కేదారేశ్వర ఆలయాలతో పాటు సమీప గ్రామమైన విలాసాగర్‌లోని శివాలయంలో, మారుపాక గ్రామంలోని నీలకంఠేశ్వరాలయంలో వేలాది దీపాలను వెలిగించాం. లక్ష దీపోత్సవం నిర్వహించాలనేది మా ఆకాంక్ష.

చదువే రేపటికి పునాది..

చదువే రేపటికి పునాది. చదువే ప్రతి పేద విద్యార్థికి పెట్టుబడి. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్నది మా అభిమతం. అందుకే ఉన్నత చదువులకు డబ్బులు లేక ఇబ్బంది పడేవారికి మావంతుగా సాయం చేస్తున్నాం. వేములవాడ రూరల్‌ మండలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్స్‌, లాంగ్‌ నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు అందజేశాం. వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు ఈ రకమైన సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.


మేం చేస్తున్న ప్రతీ సాయానికి అండాదండా మా సభ్యులే. వాళ్లే మా వెన్నెముక. బాధితుల గురించి తెలిపిన ప్రతీసారి దయార్ద్ర హృదయంతో స్పందిస్తున్నారు. మేమున్నామని, ఆదుకుంటామని ముందుకు వస్తున్నారు. తలోచేయి వేసి అవసరాన్ని గట్టెక్కిస్తున్నారు. ‘శ్రీ రాజరాజైశ్వర క్షేత్ర ఆర్యవైశ్య అన్నపూర్న సత్ర సంఘం ట్రస్ట్’ అంటే మన వాళ్లే, మనకోసమే.. అన్న నమ్మకం కలిగేలా మా సేవలు కొనసాగుతున్నాయి. ఆ నమ్మకమే.. మిమ్ములనూ మా ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తుందని మా ఆశ.. ఆకాంక్ష కూడా చేయాల్సింది మిగిలే ఉంది.. మీకూ మా స్వాగతం..

Account Details:

Account Name: SRRKAVAN

Bank Name: Union Bank

Bank Account No: 062311100002485

IFSC Code: UBIN0806234

Branch: Vemulawada

Gpay / Phonepe Number: 8121818169

అధ్యక్షులు: తాటి కొండ పవన్ కుమార్

Cell: 9246935053

గౌరవ అధ్యక్షులు: వంగేటి అశోక్ కుమార్

Cell: 9866139061

ఆలయ సమాచారాన్ని ఇప్పుడే పొందండి